నంద్యాల విద్య జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) 2024 పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల, అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్జీఎం, ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా నిర్వహణ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,675 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు డీఈవో సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి ఆరు వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
