పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమతులపూడిలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో గత 40 ఏళ్లుగా 22 ఎకరాల చెరువు భూమిలో పంటలు పండించుకుంటున్నామని రైతులు చెప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఈ భూములను తన అనుచరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అనుమతులపూడి గ్రామస్థులు, తెదేపా నాయకులు ఆరోపించారు.
