తెలంగాణ రంగా రెడ్డి కొత్తూరు: మార్చ్నం దిగామ మండల కేంద్రంలో రూ. 40 కోట్ల విలువైన భూదాన్ భూముల అన్యాక్రాంతం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తునట్లు సమచారం. నందిగామ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 545 లో 10 ఎకరాలకు పైగా భూదాన్ భూమి అన్యాక్రంతమై బడా బాబుల గుప్పిట్లో కి వెళ్లిందని పేదలు అనుభవించాల్సిన భూదాన్ భూములు ఏకంగా నాన్ అగ్రికల్చర్ భూములుగా మారి బడా వ్యాపారవేత్త ఆదీనంలో ఉన్నాయనీ, అప్పటి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల తప్పిదాలతో ఈ తతంగం నదిచిందనేది ఆ కథనాల సారాంశం. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులు ఏ మాత్రం కూడా స్పందించకుండా ఉన్నప్పటికీ నందిగామ గ్రామ శివారులో ఉన్న భూదాన్ భూముల ప్రస్తుత పరిస్థితినీ అక్కడికి వెళ్లి తెలుసుకోవడంతో పాటుగా నందిగామ తహాసిల్దార్ కార్యాలయంలో ఆ భూములకు సంబంధించిన కాగితాలను సేకరించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో భూతం భూములు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఎలా అయ్యాయి?… భూదాన్ భూములు నాన్ అగ్రికల్చర్ భూములుగా ఎలా మారాయని వారు విస్తుపోయినట్లు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 15 వేల ఎకరాలకు పైగా భూదాన్ భూములు అన్యాకాంతం అయ్యాయని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు అప్పటి అధికారులకు, పాలక పక్షాల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భూదాన్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నందిగామ భూదాన్ భూముల విషయంలొ ఎందుకు నోరుమెదపడం లేదనే విమర్శలు ప్రారంభమయ్యాయి. కింది స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పంచనామా లేకుండా వ్యవసాయ భూములు ప్లాట్లుగా మరి అవకాశం లేనే లేదు. అలాంటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న భూములు అసలైన రైతుల చేతుల్లో కాకుండా వ్యాపారుల చేతుల్లోకి ఎలా వెల్లాయనేది ప్రశ్నార్ధకంగా మారింది.
