విజయనగరం ఫిబ్రవరి 2: జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై దాడులు చేసి, నిందితులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ దీపికా పాటిల్ శుక్రవారం తెలిపారు. మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు.
పోలీసులు, సెబ్ అధికారులు తనిఖీల్లో భాగంగా దాడులు నిర్వహించి, 18 కేసులు నమోదు చేసి, 20 మందిని అరెస్టు చేసి, 66.75 లీటర్ల IMFL మద్యం స్వాధీనం చేసుకున్నారు. బాడంగి, గంట్యాడ పీఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్స్ చేసి, 10మందిని ఆదుపులోకి తీసుకొని రూ. 2,700/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 37 కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 22 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టి, ఎం.వి.నిబంధనలు అతిక్రమించిన 374 మందిపై రూ. 93,325/- లను ఈ-చలానాలు గా విధించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలు సందర్శించి, 2024 ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
