పల్నాడు: 04 ఏప్రిల్ప ల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. వైసీపీకి చెందిన నాగేశ్వరరావు తాజాగా టీడీపీ (TDP)లో చేరాడు. దీంతో ఆగ్రహించిన వైసీపీ వర్గీయులు నాగేశ్వరరావుపై దాడి చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై సైతం రాళ్లు రువ్వారు. పార్టీ నుంచి వెళతారా? అంటూ దుర్భాషలాడారు. వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం తొలిసారేమీ కాదు. గతంలోనూ జరిగాయి. మూడు నెలలు క్రితం ఓట్లు తొలగింపు విషయంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి.. టీడీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసును వైసీపీ నమోదు చేయించింది.
