విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి : ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్కి ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ 2024 పురస్కారం లభించింది. ఇటీవల ఢల్లీిలో జరిగిన కార్యక్రమంలో రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్కి అందజేసారు. ఈ సందర్భంగా మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో ఆచార్య లక్ష్మీ ప్రసాద్ని అభినందించారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాలు, అవార్డులు వర్సిటీకి ప్రతిష్టను అందిస్తాయన్నారు.
