తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 22( హింస)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి కి దక్కుతుందని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆంగ్ల భాషను వ్యతిరేకించిన కేటీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
