చెన్నై, 8 ఆగస్టు (హి.స.)రైలులో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్ చేసిన ఘటన చెన్నై (Chennai) నుంచి భగత్ కోటి (Bhagat Ki Kothi)కి వెళ్తున్న ట్రైన్‌లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అందరితో పాటే ట్రైన్ ఎక్కిన ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తిని బయటకు తోటి ప్రయాణికులను చంపేస్తానంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ బోగీలో ఉన్న వారంతా తమ సీట్ల నుంచి లేచి పరిగెత్తారు. అంనంతరం ట్రైన్ సూళ్లూరుపేటకు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఓ ప్రయాణికుడు చైన్ లాగి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందజేశాడు. అనంతరం వారు ప్లాట్‌ఫామ్ వద్దకు చేరుకుని కత్తితో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
