ఢీల్లీ, 15 జనవరి (హిం.స)‘
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న వేళ.. విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. భారత దేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందని హామీ ఇవ్వలేమని ఆయన వ్యాఖ్యానించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో మనదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది కాస్తా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసింది. దీనిపై జైశంకర్ను ప్రశ్నించగా..రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలన్నారు. ప్రతి దేశమూ ప్రతిరోజూ మన అభిప్రాయాలతో ఏకీభవిస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా ఈ ప్రపంచంతో భారత్ను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించామని జైశంకర్ తెలిపారు.
ఇతర దేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాల గురించి జై శంకర్ మాట్లాడారు. రాజకీయ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉండడం సహజమన్నారు. సాధారణంగా ఆయా దేశ ప్రజలు భారత్పట్ల సానుకూల భావాలనే కలిగి ఉంటారన్నారు. భారత్తో సత్సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని జై శంకర్ చెప్పారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
