తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 13( హింస)
రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విచారణ చేయిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. జలయజ్ఞo, ఇందిరమ్మ ఇండ్ల అంశంలో అవినీతిని బయట పెడతామని కేసీఆర్ ప్రకటించారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో గత కాంగ్రెస్ పాలనపై ఎలాంటి విచారణ చేపట్టలేదని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారం కేసీఆర్ తరహాలోనే కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక కెసిఆర్ పాలనపై విచారణ చేపడతామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదన్నారు. ఒకే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు సార్లు డిల్లీకి వెళ్ళారని, రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తే రేవంత్ డిల్లీ నుంచి పాలన కొనసాగిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
