



ఆంధ్రప్రదేశ్ 17 జనవరి ( హిం.స)అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఆసన్నమైంది. ఈ సమయంలో రామాయణంతో సంబంధం ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ మంగళవారం సందర్శించారు.
దీంతో ప్రస్తుతం అందరి దృష్టి లేపాక్షి ఆలయంపై పడింది. ప్రధాని రాకతో ఈ ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుందని భావిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ కేంద్రానికి సుమారు 14కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయంలో అణువణువూ ఓ కళాఖండమే. క్రీ.శ. 1528 నుంచి క్రీ.శ. 1549 వరకు ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో మొత్తం 878 స్తంభాలు ఉన్నాయి.
ఇందులో 246 స్తంభాలపై శిల్ప కళాకృతులు అప్పటి శిల్ప నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఆలయం పైకప్పు లోపలివైపు గీసిన అద్భుతమైన తైలవర్ణ చిత్రాలను చూడటానికి రెండు కళ్లూ చాలవు. భారత, రామాయణ, శివపురాణాల్లోని ప్రముఖ ఘట్టాలను చిత్రీకరించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
