
అమరావతి 25అక్టోబర్( హింస)రాబోయే ఎన్నికలో టీడీపీ, జనసేన నేతలు, శ్రేణులు కలిసికట్టుగా ఇంటింటి ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు.
160 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మహానాడులో ప్రకటించిన ఆరు హామీలకు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన నాలు గు వాగ్దానాలను కలిపి వచ్చే నెల 1న మినీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ కమి టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీలూ కలిసి ప్రజల్లోకి వెళ్లడానికి నిర్ణయించిన తొలి కార్యక్రమం ఇదే. సుహృద్భావ వాతావరణంలో అరమరికల్లేకుండా మాట్లాడుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరస్పరం ఆయా పార్టీల నేతలను పరిచయం చేసుకున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
