విశాఖపట్నం,7 ఫిబ్రవరి. గ్లోబల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా పోటీల్లో 49వ వార్డు పట్టాభిరెడ్డితోటకు చెందిన గెడ్డం నాగమణి ప్లాటినం కేటగిరీలో మొదటి స్థానంలో విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా 300మంది మహిళలు పోటీలో పాల్గొనగా మిసెస్ ఆంధ్రప్రదేశ్‌గా నాగమణి ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతగా బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి వ్యవహరించినట్లు నిర్వాహకులు తెలిపారు.
