ప్రకాశం, 10 అక్టోబర్ (హి.స.)పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకొని పరిసర ప్రాంతాలు పూర్తిగా దట్టమైన పొగతో కమ్ముకొని పోయాయి. ఈ షాకింగ్ ఘటన ఈ రోజు ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండల పరిధిలోని బెల్లం కోటయ్య పొగాకు పరిశ్రమ (bellam Kotaiah tobacco factory)లో చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఫ్యాక్టరీ నుంచి ఉన్నట్టుండి దట్టమైన పొగతో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
