

మచిలీపట్నం: 26 డిసెంబర్ (హిం.స)మాజీమంత్రి పేర్ని నాని పై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా.. మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ…మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా వర్థంతికి రాజకీయ రంగు పులిమారని పేర్ని నానిపై మండిపడ్డారు. రంగా అభిమానులు డీజే పర్మిషన్ అడిగితే ఇవ్వరా అని ప్రశ్నించారు.
పేర్ని నాని కొడుకు డీజేతో ఊరంతా తిరగి రంగా విగ్రహాలకు దండలు వేస్తాడా అని నిలదీశారు. పేర్ని నాని ఏ నాడైనా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాడా అని ప్రశ్నించారు. నాడు రంగా మరణాంతరం నవకళా సెంటర్ ప్రస్తుతం ఉన్న రంగా విగ్రహ ఏర్పాటుని అడ్డుకున్నది ఎవరని నిలదీశారు. రంగా విగ్రహ దిమ్మను తొలగించినది మీ తండ్రి పేర్ని కృష్ణమూర్తి కాదా అని నిలదీశారు. నేడు రంగా పేరుతో రాజకీయం చేస్తుండటం సిగ్గుగా లేదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
