ఢిల్లీ,26,,డిసెంబర్ (హిం.స) జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు చైనా నుంచి సాయం అందుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకూ అమెరికా తయారీ ఎం4 రైఫిళ్లను మాత్రమే ఉగ్రమూక వాడినట్లు గుర్తించారు. తాజాగా ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేవారు చైనా తయారీ ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తేల్చారు. దీనికి అదనంగా చైనా నుంచి డ్రోన్లు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు కూడా పాక్ ఆర్మీకి చేరుతున్నాయి. ఈ ఏడాది జమ్మూలో జరిగిన ఉగ్రదాడుల్లో వీటిని వాడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ముఖ్యంగా చైనా సాంకేతికతతో తయారైన స్నైపర్ తుపాకులను ముష్కరులు వినియోగిస్తున్నారు. గత నవంబర్లో చొరబాట్లకు యత్నిస్తున్న సమయంలో పాక్ నుంచి స్నైపర్ కాల్పులు జరిపాడు. దీనికి తోడు ఈ ఏడాది జరిగిన మూడు భారీ ఉగ్రదాడుల్లో కూడా ముష్కరులు చైనా తయారీ బాడీ సూట్ కెమెరాలను వాడినట్లు తేలింది.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
