అమరావతి, 19 ఆగస్టు (హి.స.):పిల్లలకు పంపిణీ చేసే పౌష్టికాహారంలో ఐసీడీఎస్ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు కక్కుర్తికి పాల్పడ్డారని తెలుస్తోంది. శింగనమల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం బ్యాగులు 484 మాయమయ్యాయి. ప్రాజ్టెక్‌కు బ్యాగులు వచ్చినా వాటిని చిన్నారులకు పంపిణీ చేయకుండా స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది వచ్చిన స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ఉన్నతాధికారులు గుర్తించి విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
