ఢిల్లీ , 01 జనవరి (హిం.స) నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనమ్ పాండేను దీనికి కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరి నియామకాలు జరిపినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆర్థిక సంఘం సిఫార్సుల కాలావధి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉంటుంది. అందువల్ల 2025 అక్టోబరు 31 నాటికి రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. సభ్యుల పేర్లు విడిగా ప్రకటించనున్నారు.
హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్
