తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ డిసెంబర్:28(హిం స)
నేడు గడీల పాలన సామ్రాజ్యాన్ని కూలదోసి సామాన్య ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన అద్భుతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట చౌరస్తా రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ ఖాళీ స్థలంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పట్టణ ప్రెసిడెంట్ కొంకళ్ళ చెన్నయ్య పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు చెంది తిరుపతి రెడ్డి పురుషోత్తం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగారం దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
జనార్దన్ రెడ్డి, హిందుస్థాన్ సమాచార్
