జైపుర్, 28 డిసెంబర్ (హిం.స)
ఇటీవలె ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఆయా ప్రభుత్వాలు నెరవేరుస్తున్నాయి.
ఈ క్రమంలోనే దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అదే ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. దీంతో తాము అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్పై రాయితీలు ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ను రూ.450 కే అందించనున్నట్లు ప్రకటించింది.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
