అమరావతి, 19 ఆగస్టు (హి.స.)ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా గత నెల విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం.. పవన్ కల్యాణ్ ప్రభుత్వ నిధులను వాడుకున్నారని విజయ్ కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను వారంరోజులకు వాయిదా వేసింది.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
