ముంబై, 19 ఆగస్టు (హి.స.)
పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు కల్పిస్తూ బంగారం ధర గత కొన్ని రోజులుగా తగ్గుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరులు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,01,160గా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగి రూ.1,17,000కు చేరుకుంది. ఇక 10 గ్రాముల ప్లాటినం ధర రూ.37,850గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే,22కే,18కే) ధరలు ఇలా..
చెన్నై: ₹1,01,160; ₹92,730; ₹76,680
ముంబయి: ₹1,01,160; ₹92,720; ₹75,860
ఢిల్లీ: ₹1,01,320; ₹92,890; ₹76,000
కోల్‌కతా: ₹1,01,170; ₹92,740; ₹75,880
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
