కర్నూలు, 25 డిసెంబర్ (హిం.స)
క్రిస్మస్ పండగని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా. జి. సృజన కర్నూలు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు సోమవారం తెలిపారు.
క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు, కలెక్టర్ కోరారు. క్రైస్తవులందరూ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
