హైదరాబాద్, 22 అక్టోబర్ (హి.స.)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాలతో పోలిస్తే ఈ దీపావళి సందర్భంగా కాలుష్యం తగ్గుముఖం పట్టింది. ఈ సారి పెద్దగా ప్రభావంలేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సారి గాలి కాలుష్యం తగ్గడంతోపాటు వాయు కాలుష్యం నియంత్రణలోనే ఉంది. ధ్వని కాలుష్యం మాత్రం సాధారణం కంటే స్వల్పంగా పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీపావళికి గాలి నాణ్యత, శబ్ద కాలుష్యాన్ని సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు 15రోజులపాటు పర్యవేక్షించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈనెల 13 నుంచి 27వ తేది వరకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే దీపావళి నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణలో గాలి, శబ్ధ డేటా విశ్లేషించింది. టీజీపీసీబీ విశ్లేషణ ప్రకారం కాలుష్యం ప్రభావం తగ్గిందని చెబుతున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
