








కాకినాడ 10 జనవరి (హిం.స)కాకినాడ జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. పేదల ఇళ్ల స్థలాల పేరుతో కారు చవకగా ముందే భూములు కొని ఆనక రెట్టింపు రేటుకు ప్రభుత్వానికి అంటగట్టి అయినకాడికి దోచేశారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గం క్వారీలకు పెట్టింది పేరు కావడంతో అనేక క్వారీల నుంచి నెలవారీ మామూళ్లతో కోట్లకు పడగలెత్తారు. స్వయంగా కొన్ని క్వారీలు స్వాధీన పరుచుకున్నారు. నియెజకవర్గం సమీపంలోని పోర్టు, హార్బర్, నేవల్‌బే్‌సకు వెళ్లే బండరాళ్ల టిప్పర్లనుంచీ కమీషన్లు పిండేశాడు. లెక్కకు మిక్కిలి అనధికార క్వారీలను మింగేశాడు. తన నియోజకవర్గంలోని ఉన్న ప్రముఖ దేవస్థానాన్ని కూడా వదలలేదు. వ్రత పురోహితుల నియామకంలో లక్షలకు లక్షలు దిగమింగేశారు. దేవస్థానం బస్సు డ్రైవర్ పోస్టుల నుంచి చిన్నచిన్న ఉద్యోగాల వరకు వారి నుంచి లక్షల్లో డబ్బులు పిండేశారు. ఇక ఆ నియోజకవర్గంలో కొండలు, గుట్టలు ఎక్కువ కావడంతో వాటిల్లో ఎంచక్కా సురక్షిత పేకాట స్థావరాలను సదరు నేతే గుర్తించి సమీపంలో విశాఖ నుంచి వచ్చే పేకాటరాయుళ్లకు డెన్‌లు కుదిర్చి కోట్లలో సంపాదించారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్
