దిల్లీ, 10,జనవరి (హిం.స)గాంధీనగర్లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
ఇక, మోడీ ప్రపంచ నాయకత్వాన్ని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల నాయకుడని అంబానీ చెప్పుకొచ్చారు. ప్రధానిగా మోడీ ఉంటేనే అన్ని సాధ్యం అవుతాయని చెప్పారు.. విజన్, డిటర్మినేషన్, ఎగ్జిక్యూషన్ ఉన్న ప్రధాని మోడీ కోట్ల మంది భారతీయులను ప్రతిబింబిస్తుంది.. ప్రపంచ దేశాల ప్రశంసలను ప్రస్తుతం భారత్ అందుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంలో రిలయన్స్ $150 బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.. ఇందులో మూడింట ఒక వంతు గుజరాత్కే కేటాయించామని తెలిపారు.. రిలయన్స్ రాబోయే పదేళ్లలో గణనీయమైన పెట్టుబడులతో గుజరాత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పుకొచ్చారు.. గ్రీన్ గ్రోత్లో గుజరాత్ ప్రపంచ అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
