దిల్లీ,16,జనవరి (హిం.స) టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయోధ్య రామమందిర ఆహ్వానాన్ని అందుకునేందుకు ధోని అన్ని విధాలా అర్హుడు అని అభిమానులు, నెటిజన్లు వ్యాఖ్యనిస్తున్నారు.
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశ విదేశాల్లోని మహా సాధువులతో పాటు పండితులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందించింది. ఇక, క్రీడా రంగానికి సంబందించి.. ఇప్పటికే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రన్ మిషీన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతరులకు అయోధ్య నుంచి ఆహ్వానం పింపించారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
