పెనుకొండ, 16 జనవరి (హిం.స)
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసన్ కంపెనీ ప్రారంభోత్సవంకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్న నేపథ్యంలో సోమందేపల్లి సిపిఎం పార్టీ కార్యకర్తలు ఎస్, చాంద్ బాషా, బాబులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అరెస్ట్ చేసిన సిపిఎం కార్యకర్తలను సోమందేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
