



న్యూఢిల్లీ: 16 జనవరి (హిం.స)తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
బాబుపై 17 ఏపై దాఖలు చేసిన పిటీషన్‌పై ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అయితే న్యాయమూర్తులు విడివిడిగా జడ్జిమెంట్ ఇవ్వనున్నారు.
కాగా అక్టోబర్ 20న తుది విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు పిటీషన్ వేశారు. 17 ఏ ప్రకారం రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు ముగియడంతో సుప్రీం కోర్టు తీర్పు ఈ రోజుకు వాయిదా వేసింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
