కోల్కతా: సందేశ్ఖాలీలో మహిళలపై టీఎంసీ నేతల ఆగడాల్లో నిజాలు నిగ్గు తేల్చడానికి వెళ్లిన నిజ నిర్ధారణ బృంద సభ్యులను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ బృందంలో తెలుగు వ్యక్తి, పాట్నా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి రాజ్పాల్సింగ్, నేషనల్ ఉమెన్ కమిషన్ మాజీ సభ్యురాలు చారు వలి కన్నా, న్యాయవాది భావ్నా బజాజ్ ఉన్నారు.
సందేశ్ఖాలీకి వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేసినందుకుగాను నిజనిర్ధారణ కమిటీ సభ్యులంతా ధర్నాకు దిగారు. అయితే వీరిని శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
