చండీగడ్:03 ఫిబ్రవరి : పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలిపారు.
ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను సమర్పించారు. బన్వరీలాల్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
గత కొంతకాలంగా గవర్నర్ బన్వరీలాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్.. సీఎంకు పలుమార్లు లేఖలు రాశారు.
