కేంద్రంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేస్తుంది. ప్రస్తుతం ఇండియా కూటమి 230 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీయే కూటమి 297 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
BulletsIn
- కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 1,20,206 ఓట్ల లీడ్లో ఉన్నారు.
- ఆయన పోటీ చేస్తున్న మరో స్థానం రాయ్బరేలీ (యూపీ)లో బీజేపీ అభ్యర్థిపై 68,789 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు.
- అమేథీలో కాంగ్రెస్ నేత కిశోరీ లాల్ శర్మ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై 23,428 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్, సమీప అభ్యర్థి పీపీ సునీర్ (సీపీఐ)పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
