లఖ్‌నవూ: ఎస్పీ చీఫ్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్(కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు(Illegal Mining Case) విచారణలో భాగంగా సాక్షిగా ఆయన్ను పిలిచింది. రేపు ఆయన్ను ప్రశ్నించనున్నామని దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.
అక్రమ మైనింగ్‌కు సంబంధించి రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్యకాలంలో నిబంధనలను ఉల్లంఘించి అధికారులు గనులను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.
