ఢిల్లీ : జనవరి 23( హింస)
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ ప్రోగ్రామ్స్‌కు సెలవు ప్రకటిస్తారు.. కానీ ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుక రోజున మాత్రం సెలవు ఇవ్వరు అని మమత మండిపడ్డారు.అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకను కేంద్ర ప్రభుత్వం పొలిటికల్‌గా వాడుకుందని ఆమె పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటించాలని తన జీవితాంతం పోరాడాను. ఆ విషయంలో తాను విఫలమయ్యాను.. తనను క్షమించండి అని మమత అన్నారు.
