ఢిల్లీ : కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంలో కాషాయ పార్టీ లక్ష్యంగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శలు గుప్పించారు. మాండ్యలో బీజేపీ కార్యకర్తలు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని, ఇది రికార్డుల్లో స్పష్టంగా ఉండగా దీన్ని మరుగుపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మాండ్య కేసుపై అప్పటి బీజేపీ ప్రభుత్వం సరైన విచారణ జరపలేదని అన్నారు. ఈ కేసులో బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్‌లు చేయలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
