ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగొండ ప్రాజెక్టుకి జగన్ నిధులు కేటాయించారు.
