ఢిల్లీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు ఖరారైన నేపధ్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాను పాల్గొంటానని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం ప్రకటించారు. ఆగ్రాలో జరిగే ర్యాలీకి అఖిలేష్ యాదవ్ హాజరవుతారని భావిస్తున్నారు.కాంగ్రెస్‌తో పొత్తు దిశగా తాము పలు దశల చర్చలు జరిపామని, పలు జాబితాలు పరిశీలించామని, ఇక సీట్ల సర్దుబాటు పూర్తవడంతో కాంగ్రెస్ యాత్రలో ఎస్పీ పాల్గొంటుందని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఇక రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండవ నెలలో ప్రవేశించింది. మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను సమన్వయపరుస్తూ రాహుల్ యాత్ర సాగుతోంది.
