అమరావతి:24 ఫిబ్రవరి టీడీపీ -జనసేన తొలి జాబితా నేడు విడుదల కానుంది. ఉదయం11:40కు ఉమ్మడి అభ్యర్థుల పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేయనున్నారు. మాఘ పౌర్ణమి కావడంతో ఇబ్బందులు లేని సీట్ల అభ్యర్థుల పేర్లు వెల్లడించనున్నారు.
చంద్రబాబు నివాసంలో తొలిజాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే కొందరు సీనియర్ టీడీపీ నేతలు విజయవాడ చేరుకున్నారు. వందకు పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
