దుర్గ్ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటలకు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఈ ఘటనలో ప్రమాదస్థలంలో 11 మంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు కుమ్హారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కుకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో పడినట్లు సమాచారం.
