న్యూఢిల్లీ, 17 నవంబర్ (హి.స.)
సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదంలో భారతీయులు మరణించడం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మోడీ ప్రార్థించారు. రియాద్ లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాయని తెలిపారు. భారత అధికారులు సౌదీ అరేబియా అధికారులతో సన్నిహితంగా ఉన్నారని పేర్కొన్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు
