చిత్తూరు జిల్లా: 11 మే ఎన్నికల ప్రచారంలో () భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతి ()కి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో ) నిర్వహించనున్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది. నడ్డాతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh), జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) రోడ్డు షోలో పాల్గొననున్నారు.
అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి తరపున ప్రచారం కోసం జేపీ నడ్డా ఆదోనికి వెళతారు. నగరంలోని మున్సిపల్ మైదానంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు గెలుపు కోసం ఆయన ఆదోనికి వస్తున్నారు.
