body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 26నవంబర్ (హి.స.)మలక్కా జలసంధి (Strait of Malacca).. దక్షిణ ఆండమాన్ సముద్రం ప్రాంతంలో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తుఫానుగా మారింది. మలేషియా జార్జ్‌టౌన్‌కు సుమారు 260 కి.మీ. పశ్చిమ-దక్షిణ పశ్చిమ దూరంలో, నికోబార్ దీవులకు 600 కి.మీ. తూర్పు-దక్షిణ తూర్పున కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా గంటకు సుమారు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. కాగా.. యూఏఈ దీనికి సెన్యార్ అని సూచించింది. దీనర్థం సింహం అని.
IMD అంచనా ప్రకారం.. సెన్యార్ తుఫాను మొదట పశ్చిమ-దక్షిణ పశ్చిమ దిశగా కదిలి, తర్వాతి 48 గంటల్లో తిరిగి తూర్పు దిశగా మళ్లనుంది. ఇండోనేషియా సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని.. 24 గంటలపాటు తుఫాను తీవ్రతను కొనసాగించి, తర్వాత క్రమంగా బలహీనపడనుందని పేర్కొంది.
సెన్యార్ ప్రభావంతో.. అండమాన్ & నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
