body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,04జనవరి (హి.స.) వందేభారత్ స్లీపర్ రైళ్లలో అధునాతన హంగులన్నింటినీ సమకూరుస్తున్నామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కోల్‌కతా-గువాహటి మార్గంలో త్వరలో పట్టాలెక్కబోతున్న బెర్తుల రైలును శనివారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్లో ఆయన పరిశీలించారు. పెట్టెల్లో కలియతిరుగుతూ వాటిలో సౌకర్యాలను విలేకరులకు వివరించారు. వెడల్పైన ట్రే హోల్డర్, సర్దుబాటు చేసుకోగలిగేలా కిటికీలకు తెరలు, నీళ్లు బయటకు చిమ్మడానికి అవకాశమివ్వని లోతైన వాష్‌బేసిన్లు, చదువుకునేందుకు వీలుగా లైట్లు, హ్యాంగర్లు, మ్యాగజీన్లు ఉంచే ఏర్పాట్లు వంటివన్నీ వీటిలో కల్పించినట్లు చెప్పారు. 16 పెట్టెల రైళ్లలో ఒకదానిని గువాహటికి, రెండోదానికి కోల్‌కతాకు పంపిస్తామని తెలిపారు. సీట్ల సంఖ్యల్ని బ్రెయిలీ లిపిలోనూ రాయించినట్లు చెప్పారు. కుదుపుల్లేని రీతిలో రైలును మెరుగ్గా తీర్చిదిద్దామని, శబ్దం కూడా చాలా తక్కువగా వెలువడుతుందని, కవచ్ ఉంటుందని తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకునే సాంకేతికతను, అత్యవసర పరిస్థితుల్లో లోకోపైలట్‌తో మాట్లాడే ఏర్పాట్లను చేసినట్లు వివరించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
