హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.)
విభిన్న ఆవిష్కరణలు, పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెర తీశారు. మస్క్ కు చెందిన కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్ ఏఐ సిద్ధం చేస్తోన్న నాలెడ్జ్ ఫ్లాట్ ఫామ్ లాంచింగ్కు అంతా రెడీ అయినట్లు ప్రకటించారు. దాన్ని గ్రోకీపీడీయా (Grokipedia) పేర్కొన్న మస్క్ 0.1 బీటా వెర్షన్ రెండు వారాల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఎలాన్ మస్క్ వెల్లడించారు. నాలెడ్జి ప్లాట్ ఫామ్ వీకీపిడియా తరహాలో గ్రీకీపిడియా ఓ నాలెడ్జ్ హబ్గా ప్రపంచం ముందుకు రాబోతోంది.’ గ్రోక్ పీడియా ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన నాలెడ్జ్ సోర్స్. దీనికి హద్దులు లేవు’ అంటూ @amXFreeze అనే ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు ఎలాన్ మస్క్ ఇవాళ రిప్లయ్ ఇచ్చారు. మరో రెండువారాల్లో గ్రోకీమీడియా 0.1 బీటా వెర్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత సెప్టెంబల్ో మస్క్ ఈ గ్రోకీపీడియా అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు. తాజాగా వచ్చే రెండు వారాల్లో దాన బీటా వెర్షన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు
