దిల్లీ,19,జనవరి (హిం.స) కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ(పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ తలపెట్టిన ‘భారత్ జోడో న్యాయయాత్ర’ మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్ నుంచి రాహుల్ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
