దిల్లీ, 11,,జనవరి (హిం.స) మణిపూర్లోని మరోసారి కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య జరిగింది. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులుఅదృశ్యం అయ్యారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు ముందు జరిగాయని, ఆ తర్వాత తుపాకుల కాల్పులు జరిగాయని తెలిపారు. అల్లం కోయడానికి వెళ్లిన వారి ఆచూకీ తెలియకపోవడంతో కుంబి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. గల్లతైంన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గల్లంతైన నలుగురిని దారా సింగ్, ఇబోమ్చా సింగ్, రోమెన్ సింగ్, ఆనంద్ సింగ్లుగా గుర్తించారు. వారు తీవ్రవాదుల వద్ద బందీలుగా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
