తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 11( హింస)
ఈ సంవత్సరం జులై నెలలోపు మరో 1000 బస్సులు రోడ్డెక్కనున్నాయని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మీ పథకం అమలు చేశామని ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తు విజయవంతంగా కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు.. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
