మదురై,15,,జనవరి (హిం.స)జల్లికట్టు అనేది పొంగల్ వేడుకల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకునే పురాతన క్రీడ. ఈ క్రీడలో ఒక ఎద్దును ప్రజల సమూహంలోకి విడుదల వదులుతారు. ఆ తర్వాత ఎద్దు వెనుక ఉన్న పెద్ద మూపురాన్ని పట్టుకుని దానిని ఆపడానికి అనేక మంది ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మదురైలో జల్లికట్టును సోమవారం ప్రారంభించారు. ఆ కార్యక్రమం కోసం 1,000 ఎద్దులు, 600 వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. మరో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
తమిళనాడు మదురైలోని అవనియాపురం జల్లికట్టుకార్యక్రమంలో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
