ఏలూరు జిల్లా: 16 జనవరి (హిం.స)పోలవరం మండలం, కొత్త పట్టిసీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్ (40) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
