,
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ 17 నవంబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
,బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) సోమవారం ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జులై-ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. పోలీస్ మాజీ చీఫ్ చౌధురీ అబ్దుల్లా అల్-మామున్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఆగస్టు 5న ఢాకాలోనిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పు(ICT verdict)లో ప్రస్తావించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు
